Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

డీవీ
శుక్రవారం, 8 నవంబరు 2024 (15:15 IST)
DiL Raju speech
ఈమధ్య తెలుగు సినిమారంగంలో కొత్తగా వచ్చే కథానాయకులకు తమ సినిమా ప్రమోషన్ కోసం కొందరు ప్రముఖులను కలిస్తే ప్రచారానికి ససేమిరా అనడం తెలిసిందే. ఈ విషయం చాలామంది నూతన హీరోలకు జరిగిన మాట వాస్తమే. దీనిపై దిల్ రాజు ఇండస్ట్రీ పెద్దగా నేడు మాట్లాడారు. నేను మొన్న ఓ వీడియో చూశాను. తాను చేసిన సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజేష్ అనే కథానాయకుడు చాలా బాధను వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీ ఎవ్వరూ గెస్ట్ లుగా రావడంలేదనీ, ఏవో కారణాలతో వాయిదా వేస్తున్నారనీ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇది విన్నాక నేను క్లారిటీ ఇవ్వదలిచాను. ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ ఎవరూ సపోర్ట్ చేయరు. మనమేంటో ముందుగా మనం నిరూపించుకోవాలి. అప్పుడు నీవెనుక ఇండస్ట్రీ వుంటుంది. ఇక్కడ ఎవరి పనుల్లో వారు బిజీగా వుంటారు. ఒక్కోసారి టైం సెట్ కాకపోవచ్చు. షడెన్ వస్తానన్నవారు రాకపోవచ్చు. అంతేకానీ ఇక్కడ మనం పిలిస్తే రాలేదని అనడం కూడా సరికాదు. 
 
నేను కొత్తగా ఓ విలేజ్ నుంచి వచ్చా. హైదరాబాద్ లో పంపిణీదారుడిగా కొన్ని సినిమాలు చేశాను. నిర్మాతగా సినిమారంగంలోకి వచ్చినప్పుడు నాకూ కొత్తే. ఎవ్వరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. నా సినిమా హిట్ అయ్యాక.. అప్పుడు నా పేరు దిల్ రాజుగా మారిపోయింది అని తెలిపారు. ఇప్పుడొస్తున్న ఔత్సాహిక కళాకారులు ఎంతోమంది తమ టాలెంట్ ను నిరూపించుకోనేందుకు వస్తున్నారు. వారు ప్రతిభ బయటపడితే అప్పుడు ఇండస్ట్రీలో మీ గురించి మాట్లాడుకుంటుంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayamma’s 69th Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

కారు ప్రమాదానికి గురైన అజిత్- కారు రేసును ఫ్యామిలీ కోసం వదులుకోరా? (video)

రియల్ కాదు రీల్.. రీల్స్ చేస్తూ రైలు నుంచి దూకేసింది.. అత్యాచారం జరగలేదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments