Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌తీష్ వేగేశ్నకి దిల్ రాజు హ్యాండ్ ఇచ్చాడా..?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (11:07 IST)
శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స‌తీష్ వేగేశ్న‌. క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ స‌క్స‌ెస్ సాధించిన ఈ సినిమా జా తీయ స్ధాయిలో అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత వేగేశ్న స‌తీష్ యువ హీరో నితిన్‌తో శ్రీనివాస క‌ళ్యాణం తెర‌కెక్కించారు. 
 
అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు నిర్మించిన‌ ఈ మూవీ కూడా శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం వ‌లే ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది అనుకున్నారు కానీ..లెక్క త‌ప్పింది...సినిమా ఫ్లాప్ అయ్యింది. త‌ర్వాత ఇదే డైరెక్ట‌ర్‌తో థ్యాంక్యూ అనే సినిమా తీయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఈ ప్రాజెక్ట్ ఏమైందో తెలియ‌దు.
 
ఇప్పుడు మ‌రో ఎమోష‌న‌ల్ డ్రామా తీసేందుకు స‌తీష్ వేగేశ్న రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మించ‌నుంద‌ని తెలిసింది. ఇటివలే ఖాకీ సినిమాను తెలుగులో విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతోంది. 
 
యంగ్ హీరో న‌టించే ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి..దిల్ రాజు స‌తీష్ వేగేశ్న‌తో నిర్మిస్తాన‌న్న థ్యాంక్యూ ఎందుకు ఆగిందో..? ఎందుకు హ్యాండ్ ఇవ్వాల్సి వ‌చ్చిందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments