Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధృవ కూడా ఫట్టేనా? 3 రోజులకు తర్వాత బోసిపోయిన థియేటర్లు.. చెర్రీ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ..

రామ్‌చరణ్ ఖాతాలో మరో ఫట్ పడినట్లేనా? ధృవ కూడా ఆశించిన స్థాయిలో చెర్రీకి గుర్తింపు సంపాదించిపెట్టలేదా? అనే ప్రశ్నలకు టాలీవుడ్‌లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ధృవ కోసం చరణ్ చాలా శ్రమించాడు. చరణ్‌తో బాట

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (12:50 IST)
రామ్‌చరణ్ ఖాతాలో మరో ఫట్ పడినట్లేనా? ధృవ కూడా ఆశించిన స్థాయిలో చెర్రీకి గుర్తింపు సంపాదించిపెట్టలేదా? అనే ప్రశ్నలకు టాలీవుడ్‌లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ధృవ కోసం చరణ్ చాలా శ్రమించాడు. చరణ్‌తో బాటు అరవింద్ స్వామి కూడా ఆడియెన్స్‌‍ని తమ నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఇది రీ-మేక్ సినిమా అన్న ముద్ర పడిపోయింది. తమిళంలో ఒరిజినల్ చిత్రం తని ఒరువన్ చూసినవాళ్ళు ధృవ చూసి పెదవి విరుస్తున్నారు. పాటలు పేలవంగా ఉన్నాయని చెప్తున్నారు. 
 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోలేదని టాక్ వస్తోంది. నోట్ల రద్దు ప్రభావం ధృవపై పడిందని చెప్తున్నారు. చిత్రం విడుదలైన మొదటి మూడు రోజులూ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టినా ఆ తరువాత బోసిపోయాయి. కలెక్షన్స్ డల్ అయ్యాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
కేవలం హీరో, విలన్ లకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఇతర పాత్రలను పక్కనబెట్టేశారని టాక్ వస్తోంది. అయితే చెర్రీ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ. బ్రూస్ లీ చిత్రం తరువాత ఇన్నాళ్ళకు తమ అభిమాన హీరో సినిమా చూడగలిగామని ఫుల్ జోష్‌లో ఉన్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా తెరపైకి రానుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments