Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో యూత్ హీరోల హవా.. సందీప్ కిషన్ ఆ లిస్టులో చేరిపోయాడా?

టాలీవుడ్‌లో యూత్ హీరోల హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సుప్రసిద్ధ కెమెరామెన్ చోటా కే నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ తన ట్యాలెంట్‌తో వచ్చిన క్యారెక్టర్లకు చేసుకుంటూ పోతున్నాడు. హీరోగా సెటిల్ కావడాన

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (12:37 IST)
టాలీవుడ్‌లో యూత్ హీరోల హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సుప్రసిద్ధ కెమెరామెన్ చోటా కే నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ తన ట్యాలెంట్‌తో వచ్చిన క్యారెక్టర్లకు చేసుకుంటూ పోతున్నాడు. హీరోగా సెటిల్ కావడానికి బాగా కష్టపడుతున్నాడు. 'ప్రస్థానం' సినిమాతో విలన్‌గా పరిచయమైన సందీప్ కిషన్ హీరోగా అప్ అండ్ డౌన్స్ చాలా చూసాడు. 
 
మేనల్లుడికి బ్యాక్ అప్‌గా నాయుడు ఎంత ట్రై చేసిన వాళ్ళిద్దరూ కల గంటున్న డ్రీం హిట్ మాత్రం ఇంకా అందని ద్రాక్షాలాగే ఉంది. ప్రస్తుతం సందీప్ కిషన్ 'నక్షత్రం' మూవీలో చేస్తున్నాడు. రెజీనా హీరొయిన్, కృష్ణ వంశీ దర్శకుడు. ఇందులో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గెట్ అప్‌లో కనపడనున్నాడు సందీప్. మొదటిసారి తనిష్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. 
 
సందీప్ కిషన్ కెరీర్‌తో పాటు ముందు చూపుతో బిజినెస్ కూడా ప్రారంభించాడు. జుబ్లీ హిల్స్‌లో 'వివాహ భోజనంబు' అనే పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు. అచ్చ తెలుగు వంటకాలను అందించే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ లో ఫస్ట్ బ్యాచ్‌గా మీడియానే ఇన్వైట్ చేసాడు సందీప్.
 
ఇంకేముంది వచ్చిన వాళ్ళంతా ఆహా ఓహో అనటమే కాదు టేస్ట్ చాలా బాగుంది అంటూ సందీప్‌ని తెగ మెచ్చుకున్నారట. గతంలో కూడా శోభన్ బాబు, మురళి మోహన్, నాగార్జున లాంటి వాళ్ళు సైతం ఇలా సక్సెస్ అందుకున్న వాళ్ళే. ఇప్పటికే సమంత, నితిన్‌ కలిసి హైదరాబాదులో ఓ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments