Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అసురన్

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (19:30 IST)
కొలవెరి ఫేమ్ ధనుష్ హీరోగా మాణిమరన్ దర్శకత్వంలో మంచు వారియర్, పశుపతి, కేన్ కరణాస్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా అసురన్. 2019లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అంతేకాదు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తమిళంలో పలు చిత్రోత్సవాలతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. 
 
తాజాగా ఈ చిత్రం జపాన్ దేశంలోని ఒసాకా నగంలోకి జరుగుతోన్న తమిళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రం విభాగంలో పోటీ పడుతున్న ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికవుతుందా లేదా అనేది చూడాలి. ఇక 'అసురన్' సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే తెలుగులో సీనియర్ టాప్ కథానాయకుడు వెంకటేష్.. 'నారప్ప' టైటిల్‌తో అనంతపురం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ మే 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments