Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

దేవి
శుక్రవారం, 5 డిశెంబరు 2025 (12:15 IST)
Dhanush, Kriti Sanon
ధనుష్, కృతి స‌న‌న్ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘తేరే ఇష్క్ మై’కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇప్ప‌టికే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. ధ‌నుష్‌, కృతి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యి వారిని ప్ర‌శంసిస్తున్నారు. సినిమాలోని పాత్ర‌లు, వాటి మ‌ధ్య ఉన్న ఎమోష‌న్స్, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం ఇలా అన్నీ క‌లిసి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాయి.

దీన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా సినిమా తెలుగు ట్రైల‌ర్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో సినిమా చూడాల‌నే ఎగ్జ‌యిట్మెంట్ మ‌రింత‌గా పెరుగుతోంది.
 
హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌, కొన్ని ప‌రిస్థితుల్లో హీరో ప్రేమ‌ను కోల్పోవ‌టం, ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు రావ‌టం వంటి ఫీలింగ్స్‌ను ట్రైల‌ర్‌లో చాలా చ‌క్క‌గా చూపించారు. క‌థ‌లోని డెప్త్, ప్రేమలోని తెలియ‌ని బాధ‌ల‌ను కూడా ప్రేక్ష‌కులు మెచ్చే రీతిలో తెర‌కెక్కించారు. క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించటంలో త‌న ప్రత్యేక‌త‌ను చాటే ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్‌.రాయ్ శైలి ఇందులో స్ప‌ష్టంగా తెలుస్తోంది. సినిమాలోని ఎమోష‌న‌ల్ డెప్త్‌ను త‌న రైటింగ్ స్టైల్లోనే ఆయ‌న ఆవిష్క‌రించాడు. ఇది సినిమాను మ‌రింత గొప్ప సినిమాటిక్ జ‌ర్నీగా మార్చింది.
 
గుల్ష‌న్ కుమార్, టి సిరీస్‌, క‌ల‌ర్ ఎల్లో స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన తేరే ఇష్క్ మై సినిమాను ఆనంద్ ఎల్.రాయ్‌, హిమాన్షు శ‌ర్మ‌, భూష‌ణ్ కుమార్‌, కృష్ణ కుమార్ నిర్మించారు. ఆనంద్ ఎల్.రాయ్ సినిమాను తెర‌కెక్కించారు. హిమాన్షు శ‌ర్మ‌, నీర‌జ్ యాద‌వ్ సినిమా రైట‌ర్స్‌, ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఇర్ష‌ద్ క‌మిల్ సాహిత్యాన్ని అందించారు. న‌వంబ‌ర్ 28 నుంచి ఈ సినిమా హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments