Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ ద్విపాత్రాభినయంలో 'ధర్మయోగి'.. దీపావళికి రిలీజ్

'రఘువరన్‌ బి.టెక్‌' హీరో ధనుష్‌ తాజాగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి' (ది లీడర్‌) పేరుతో తెలుగులో విడ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (19:12 IST)
'రఘువరన్‌ బి.టెక్‌' హీరో ధనుష్‌ తాజాగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి' (ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదలకానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్‌లో శుక్రవారంరాత్రి విడుదల చేశారు. హీరో ధనుష్‌ పాటల సీడీని విడుదల చేశారు.
 
నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ... ''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హైఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళస్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. 
 
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి  సంగీతం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 500కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. త్రిష ఈ సినిమా నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో చేస్తోంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments