Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ చిత్ర పరిశ్రమకు అల్లు శిరీష్... మోహన్‌లాల్ కాంబినేషన్లో సినిమా

స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మల్లూవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా క్రేజ్‌ను దక్కించుకోబోతున్నాడు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్. ఇటీవలే శ్రీరస్తు శుభమస్తు వంటి బ్

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (19:07 IST)
స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మల్లూవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా క్రేజ్‌ను దక్కించుకోబోతున్నాడు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్. ఇటీవలే శ్రీరస్తు శుభమస్తు వంటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రంతో మంచి ఊపు మీదున్న శిరీష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు. 
 
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. అది కూడా ఓ యూనివర్శల్ సబ్జెక్ట్ ద్వారా.... ఓ మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని శిరీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ కథానాయకుడిగా 1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రం రూపొందించనున్నారు. ఈ చిత్రంలోనే అల్లు శిరీష్ ట్యాంక్ కమాండర్‌గా కీలక రోల్ ప్లే చేయనున్నారు. మలయాళ క్రేజీ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకుడు. 
 
మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.... మోహన్‌లాల్‍తో కలిసి నటించే అవకాశం తొలి సినిమాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు ఇదే సరైన సబ్జెక్ట్ అని భావిస్తున్నాు. 1971 బియాండ్ బోర్డర్స్ పేరుతో రూపొందించబోయే ఈ చిత్రంలో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాను. ఈ చిత్ర కథ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రూపొందించట్లేదు. హ్యూమన్ డ్రామా, ఎమోషన్స్‌తో కూడిన చిత్రమిది. ప్రతీ భారతీయుడు గర్వపడే రీతిలో ఉండే ఈ చిత్రాన్ని కోరుకుంటాడని ఆశిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments