Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 8 మే 2019 (14:45 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వంటి హీరోలకు ల్యాండ్ మార్క్‌ సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందాడు. ఇపుడు మహేష్ బాబు చిత్రానికి కూడా డీఎస్పీ సంగీతం సమకూర్చిన అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
టాలీవుడ్‌లో ఉన్న సంగీత దర్శకుల్లో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. డీఎస్పీ సంగీతం అంటే మ్యూజికల్‌గా హిట్ కొట్టినట్టే. ప్రస్తుతం దేవిశ్రీ మహేష్ బాబు 25వ సినిమాకు సంగీత బాణీలు సమకూర్చాడు. మహర్షిలో సాంగ్స్ పెద్దగా లేవు అనుకున్న వాళ్లకు మహర్షి థీమ్ సాంగ్‌తో సమాధానం చెప్పాడు. "మహర్షి"కి సంగీతం అందిస్తున్న దేవీశ్రీ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. 
 
అదేమంటే.. సౌత్ స్టార్ హీరోల ల్యాండ్ మార్క్‌గా చెప్పుకునే సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో', కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 25వ సినిమా 'సింగం' అలానే మెగాస్టార్ 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ 25వ సినిమా 'మహర్షి'కి కూడా దేవిశ్రీ సంగీతం అందించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments