Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవిశ్రీ ప్రసాద్ చేతులమీదుగా "నేనోరకం" సాంగ్ టీజర్‌ను లాంఛ్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం "నేనోరకం". ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్

Webdunia
బుధవారం, 13 జులై 2016 (16:35 IST)
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం "నేనోరకం". ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్దమైంది. కాగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం సాంగ్ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి.
 
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, 'నేనోరకం' టీజర్, సాంగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. సాయి రామ్ శంకర్ కెరీర్‌లో "నేనోరకం" బెస్ట్ మూవీ అవుతుందన్నారు.
 
ఇకపోతే సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ, 'నేనోరకం' సాంగ్ టీజర్‌ను దేవిశ్రీ ప్రసాద్ లాంఛ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. కాంటెపరరీ ఇష్యూస్‌ను స్ఫూర్తిగా తీసుకొని, ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు. 
 
దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ 'నేనోరకం' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో రూపొందించటం జరిగింది. ఆడియెన్స్‌కు సరికొత్త థ్రిల్‌ను అందించే చిత్రమిదని అన్నారు. 
 
నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలలొనే పాటలను విడుదల చెయనున్నాం. అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా‌ను సిద్దం చేయటం జరిగింది. రాధిక శరత్ కుమార్ తమిళ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్ర విజయంపై వంద శాతం నమ్మకంతో ఉన్నామన్నారు. 
 
రేష్మి మీనన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎం.ఎస్ నారాయణ, ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాథ్, పృథ్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?

మీ బండికి రూ. 100కి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంకులోకి రూ.90 ఆయిల్, 11 నెలల్లో రూ. 2 కోట్లు మోసం

Priest Break Dance : వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్‌లు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments