Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామి పదవికి రాజీనామా చేసిన దీపికా పదుకొనె

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (14:46 IST)
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె  కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజ్(మామి)‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు. వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండడంతో తాను వేరే బాధ్యతలపై దృష్టి సారించడానికి సమయం సరిపోవడం లేదని ఆమె తెలిపారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. 
 
"మామి బోర్డులో సభ్యురాలిగా ఉన్నందుకు, చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించినందుకు ఎంతో గర్విస్తున్నా. ఒక నటిగా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టాలెంట్‌ని గుర్తించి ముంబైకి తీసుకురావడం ఆనందాన్ని ఇచ్చింది. అయితే, ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో నేను బిజీగా ఉన్నాను. దానివల్ల ‘మామి’కి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నా. దాంతో నేను పదవీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నా. ‘మామి’తో నాకున్న అనుబంధం విడదీయరానిది" అని దీపిక తన పోస్టులో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, అమీర్‌ఖాన్‌ సతీమణి కిరణ్‌రావు పదవీ కాలం పూర్తైన తర్వాత 2019లో దీపికా ‘మామి’ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె షారుఖ్‌ నటిస్తున్న ‘పఠాన్‌’ చిత్ర షూట్‌లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా హృతిక్‌ కథానాయకుడిగా రానున్న ‘ఫైటర్‌’తోపాటు నాగ్‌అశ్విన్ ‌- ప్రభాస్‌ ప్రాజెక్ట్‌లోనూ దీపికా కథానాయికగా కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments