Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాముడుగా మహేష్ - సీతగా దీపికా పదుకొనె : దృశ్యకావ్యంగా "రామాయణం"

Advertiesment
రాముడుగా మహేష్ - సీతగా దీపికా పదుకొనె : దృశ్యకావ్యంగా
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (14:44 IST)
టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, మధు మంతెన కలసి రామాయణ కథను భారీ ఎత్తున వెండితెరకు ఎక్కించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మూవీలో రాముడుగా మహేష్ బాబు, సీతగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనెలు నటించనున్నారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 
 
ప్రస్తుతం సినీ రంగంలో పౌరాణిక, చారిత్రక కథల నేప‌థ్యంలో పలు చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుని లాభాలను అర్జించి పెట్టాయి. దీంతో పలువురు నిర్మాతలు ఈ తరహా సినిమాలు చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. 
 
బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్.. "ఆదిపురుష్" అనే టైటిల్‌తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రామాయ‌ణ‌గాథ నేప‌థ్యంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 3డీలో చిత్రీకరించనున్నారు. 
 
ఈ మూవీలో గ్రాఫిక్స్ కోసమే దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, రావ‌ణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత‌గా కృతిస‌న‌న్, రాముడి తండ్రైన దశరథుడి పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, హేమమాలిని, అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లలో క‌నిపించ‌నున్నారు.  
 
ఇపుడు తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెన గ‌తంలో రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్‌లు దర్శకత్వం వహించనున్నారు. 
 
మూడు భాగాలుగా ఈ రామాయ‌ణ గాథ‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా ఇందులో రాముడిగా మ‌హేష్ బాబు, రావ‌ణుడిగా హృతిక్ రోష‌న్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. 2022లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ 2024లో విడుద‌ల కానుంది.  
 
మొత్తం మూడు భాగాలుగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి డిజైన్ చేస్తున్నారు. 1500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాలను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించడానికి సిద్ధమయ్యారు. 
 
ఇక ఇందులో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు ఆయా పాత్రలను పోషిస్తారు. అలాగే, ఈ చిత్రంలో మరో కీలక పాత్ర రావణుడి పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ధరిస్తారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నాట్యం' చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న క్లాసికల్ డ్యాన్సర్ సంధ్య రాజు