Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున కొత్త సినిమాల పోస్టర్ల సందడి.. "రావణాసుర"గా రవితేజ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (15:12 IST)
దీపావళి పండుగ రోజున కొత్త సినిమా పోస్టర్లు సందడి చేశాయి. తమిళ అగ్రహీరోలై ధనుష్, విజయ్‌లతో పాటు టాలీవుడ్ హీరో రవితేజ, సమంతలు నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేశారు. ఇందులో రవితేజ "రావరణాసుర"గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. అలాగే, సమంత "యశోద"గా కనిపించనున్నారు. విజయ్ "వారసుడు"గాను, ధనుష్ ద్విభాషా చిత్రం "సార్‌"గా వస్తున్నారు. 
 
సమంత ప్రధాన పాత్రను పోషించిన "యశోద" చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదలకానుంది. దీపావళిని పురస్కరించుకుని ఈ చిత్ర బృందం కొత్త పోస్టరును రిలీజ్ చేసింది. హీరో రవితేజ "రావణాసుర" నుంచి కూడా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానరులో నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ 7వ తేదీన విడుదలకానుంది.
 
తమిళ అగ్రహీరో విజయ్ కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో "వారసుడు". తమిళంలో "వారిసు" పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌. తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలారు. 
 
మరోవైపు తమిళ హీరో ధనుష్ - టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "సార్". తమిళంలో "వాత్తి". సితార బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆలోచింపజేసే కథతో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments