Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ అదుర్స్.. డేవిడ్ వార్నర్ వెల్ డన్ అన్నాడు..

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (13:26 IST)
Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు మాములుగా లేదు. గతేడాది చివరల్లో ఈయన హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.

ఈ సినిమాలో నటనకు బెస్ట్ యాక్టర్‌గా ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్, సైమా సహా పలు అవార్డులు అందుకున్న ఇతను తాజాగా ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో సీఎన్ఎన్ న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్.. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సీఎన్ఎన్ న్యూస్ 18 గ్రూపుకు మరియు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.  
 
ఈ క్యాటగిరీలో అల్లు అర్జున్ పుష్పతో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ టీమ్‌తో పాటు సంచలన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో పాటు.. గంగూబాయ్ కతియావాడి సినిమాకు గాను ఆలియా భట్, భూల్ భులయ్యా సినిమాలోని నటనకు కార్తీక్ ఆర్యన్ నామినేట్ అయ్యారు.

ఇక ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో జ్యూరీ అల్లు అర్జున్‌కు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. CNN న్యూస్ 18 నుండి  'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అనే అవార్డును భారత కేంద్ర మంత్రివర్గంలోని మంత్రి స్మృతి ఇరానీ అందించారు. 
 
ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్న సందర్భంగా.. అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ "వెల్ డన్" అని రాశాడు. దీనిపై అల్లు అర్జున్ తన కృతజ్ఞతా భావాన్ని చూపించాడు. హార్ట్ ఎమోటికాన్‌లతో "ధన్యవాదాలు" అని రాశాడు.
 
కాగా.. పుష్ప ది రైజ్ ఎట్ SIIMA ఇప్పుడు దక్షిణాదిన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది పుష్ప: ది రైజ్. ఇప్పుడు, సూపర్ స్టార్ ఢిల్లీలో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022' టైటిల్‌ను గెలుచుకోవడంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డును అందుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ పూర్తిగా భారతీయ దుస్తులను ధరించి కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments