Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తికేయ‌2 వాయిదా గురించి డేట్ ఫిక్స్ చేశారు

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (16:09 IST)
Karthikeya2 team
హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అస‌లు ఈ సినిమా ఆగ‌స్టు 12న విడుద‌ల కావాల్సివుంది. కానీ ఒక్క‌రోజు త‌ర్వాత‌కు జ‌రిగింది. అంటే ఆగ‌స్టు 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ఇందుకు కార‌ణం పెద్ద‌గా లేక‌పోయినా శ‌నివారం సెంటిమెంట్‌గా ఫీల‌య్యార‌ని అడిగితే, అదేమీ లేదు. 12న ప‌లు సినిమాలు విడుద‌ల వున్నాయ‌ని తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు చందు మొండేటి మాట్లాడుతూ, కృష్ణ‌త‌త్త్వంతో కూడిన క‌థ ఇది. భాగ‌వ‌తంలోని ఓ అంశాన్ని తీసుకుని సినిమా మ‌లిచాం. నిఖిల్ అద్భుతంగా న‌టించాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్  స‌రైన పాత్ర పోషించింది అన్నారు.
 
నిఖిల్ తెలుపుతూ, ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. ఇది యూనిక్ క‌థ‌. అందుకే అన్ని భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇందుకు క‌థ ప్ర‌దాన బ‌లం. మా సినిమాలో అనుపమ్ ఖేర్  కీలక పాత్రను పోషించారు. ఇది అంద‌రికీ న‌చ్చే క‌థ‌. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో రూపొందుతోంది అని చెప్పారు.
 
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, కార్తికేయ‌లో నేను న‌టించ‌లేదు. ఇందులో క‌థ ప్ర‌కార‌మే నా పాత్ర వుంటుంది. యూనిక్ స‌బ్జెక్ట్‌లో చేయ‌డం చాలా ఆనందంగా వుంది. క‌థ‌, క‌థ‌నం ఆట్టుకునేలా వుంటాయ‌ని చెప్పారు.   కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.  సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేనితోపాలు టెక్నీషియ‌న్ ప‌నిత‌నం చిత్రానికి హైలైట్‌గా వుంటుంద‌ని నిర్మాత‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments