Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి 'అమ్మ' వర్సెస్ వర్మ 'శశికళ'... పోటీ పడుతున్న డైరెక్టర్లు

తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల వేడి గురించి తెలిసిందే. తమిళనాడులో జయలలిత, శశికళలపై సినిమాలు తీస్తారో తీయరో తెలియదు కానీ తెలుగులో మాత్రం పోటీ మొదలైనట్లు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే దర్శకరత్న దాసరి నారాయణ రావు అమ్మ అనే టైటిల్ ను తాజాగా రిజిష్టర్ చ

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (20:41 IST)
తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల వేడి గురించి తెలిసిందే. తమిళనాడులో జయలలిత, శశికళలపై సినిమాలు తీస్తారో తీయరో తెలియదు కానీ తెలుగులో మాత్రం పోటీ మొదలైనట్లు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే దర్శకరత్న దాసరి నారాయణ రావు అమ్మ అనే టైటిల్ ను తాజాగా రిజిష్టర్ చేయించారు. ఈ టైటిల్ వింటేనే అర్థమవుతుంది. అది దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించేనని. నిజమే... ఆమె పైన చిత్రాన్ని తీసేందుకు దాసరి నారాయణ రావు సన్నద్ధమవుతున్నారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
 
జయలలిత గురించిన విషయాలు తనకు చాలా తెలుసుని అప్పట్లో దాసరి చెప్పారు కూడా. కాబట్టి అమ్మ చిత్రం రావడం ఖాయమన్నమాటే. ఇదిలావుంటే రాంగోపాల్ వర్మ కూడా తమిళ రాజకీయాల పైనే టార్గెట్ పెట్టారు. శశికళ అని ఇటీవలే ఓ టైటిల్ రిజిష్టర్ చేశారు. శశికళ అంటే ఎవరో కాదు... జయలలిత నెచ్చెలి ప్రస్తుత అన్నాడీఎంకే చీఫ్. కాబట్టి ఆమె గురించి చిత్రాన్ని లాగించేందుకు వర్మ రెడీ అవుతున్నారు. మరి ఎవరు ముందుగా చిత్రాన్ని తీస్తారో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments