Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ దర్బార్ స్టిల్స్ రిలీజ్.. కేరింతలు కొడుతున్న ఫ్యాన్స్

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (12:02 IST)
సెన్సేషన్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజా చిత్రం "దర్బార్". ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు. 2.O చిత్రం తర్వాత తలైవా నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్ కాగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నాడు. 
 
బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో ర‌జ‌నీ ద్విపాత్రాభినయం చేస్తుంటే... వీటిలో ఓ పాత్ర పోలీసు అధికారి రోల్ కాగా, మ‌రొక‌టి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. ఈ చిత్రం అభిమానుల‌కి మంచి ఫీస్ట్ ఇస్తుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించి రజినీకాంత్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ర‌జ‌నీకాంత్ లుక్స్ ప్రేక్ష‌కుల‌కి ప‌ట్ట‌లేని ఆనందాన్ని అందిస్తున్నాయి. అతి త్వ‌రలోనే చిత్ర టీజ‌ర్ రిలీజ్‌కి మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 25 యేళ్ళ తర్వాత రజనీ వెండితెరపై పోలీసు అధికారి గెటప్‌లో దర్శనమివ్వబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ఈ చిత్రంలో యువ‌రాజ్ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్, విజ‌య్ సేతుప‌తి ధ‌ర్మ‌దొరైలో న‌టించిన జీవా అనే ట్రాన్స్‌జెండ‌ర్ ద‌ర్భార్‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నార‌ట‌. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న‌ విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments