Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌లో 'దండుపాళ్యం2': బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో జైలు సెట్!

Webdunia
గురువారం, 12 మే 2016 (17:40 IST)
పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్యం' ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న 'దండుపాళ్యం2' చిత్రం 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత వెంకట్‌. 
 
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''40 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. బెంగళూరు, బెల్గావ్‌లలో షూటింగ్‌ చేయడం జరిగింది. దండుపాళ్యం తర్వాత మరో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో చేస్తున్న ఈ సీక్వెల్‌లో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాం. ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు. 
 
నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చేయడం జరిగింది. మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ అయి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను జూన్‌, జూలై నెలల్లో పూర్తి చేసి సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments