విశ్వక్ సేన్‌పై దానం నాగేంద‌ర్‌, త‌లసాని శ్రీ‌నివాస్ చ‌ర్య తీసుకున్నారా (లేటెస్ట్‌)

Webdunia
బుధవారం, 4 మే 2022 (17:24 IST)
Vishwak Sen
సినీ హీరో విశ్వక్ సేన్ త‌న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం' థియేట్రికల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్రాంక్ ప‌బ్లిసిటీ చేసుకుని పాపుల‌ర్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో టీవీ యాంకర్ దేవి నాగవల్లితో మాటల వాగ్వివాదం సందర్భంగా  ఫ‌క్‌.. అనే ప‌ద‌జాలం వాడ‌డంతో ఇవి చూసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, టి.ఆర్‌.ఎస్‌. నాయ‌కుడు నాగం దానేంద‌ర్‌లు విశ్వక్ సేన్‌పై చ‌ర్య తీసుకుంటామ‌ని విలేక‌రుల‌కు తెలియ‌జేశారు.
 
ఈ విష‌య‌మై విశ్వక్ సేన్ బుధ‌వారంనాడు వివ‌ర‌ణిస్తూ, దానంగారు ఓ మేరేజ్ ఫంక్ష‌న్‌కు వెళితే అక్క‌డ విలేక‌రుల అడ‌గ‌డం జ‌రిగింది. కానీ ఆయ‌న‌కు పూర్తి వివ‌రాలు తెలియ‌వు క‌నుక అలా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా త‌ల‌సాని గారు కూడా ఫ్రాంక్ వీడియో నేప‌థ్యంకానీ, ఆ త‌ర్వాత ఏమ‌యింది అని కానీ తెలీదు. నేను వారిని ప‌ర్స‌న‌ల్‌గా క‌లుస్తాను అని చెప్పారు. 
 
కాగా, జూబ్లీహిల్స్ రోడ్ల‌పై ప‌ర్మిష‌న్ లేకుండా ఇలా వీడియోలు చేయ‌డం నిషేధం అని  కొంద‌రు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప‌రుష‌ప‌ద‌జాలం వాడిన విశ్వ‌క్‌సేన్‌పై చర్య తీసుకోవాలని దేవి మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 
 
అయితే ఇప్ప‌టికే రెండు రోజులు అయిన ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ఈరోజే తాను చాలా ఫ్రీగా వున్నాన‌ని, భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేయ‌న‌ని అన‌డం విశేషం. ఈ శుక్ర‌వార‌మే ఆయ‌న సినిమా విడుద‌ల‌కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: తిరుపతిలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments