నిన్నంతా తెలుగుసినీరంగంలో విశ్వక్ సేన్ ఫేక్ వీడియోనే హల్ చల్ చేసింది. ఈ క్రమంలో టీవీ9కు చర్చకు వెళ్ళిన విశ్వక్ సేన్ అక్కడ యాంకర్ అడిగిన పాగల్ సేన్ అనే మాటకు ఆయన హర్ట్ అయి ఓ దశలో బూతులు తిట్టాడు. అదేరోజు రాత్రి విశ్వక్ సేన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విశ్వక్ సేన్ ఇలా సమాధానం ఇచ్చాడు.
సినిమాలో ఏవిధంగా మాట్లాడినా చెల్లుబాటుఅవుతుంది. కానీ పబ్లిక్‌లో వున్నప్పుడు పదాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి కదా అన్న ప్రశ్నకు.. నేను యువకుడిని కదా ఆవేశం వుంటుంది. నా కాలికి దెబ్బ తగిలితే వెంటనే అమ్మా.. అంటాం. ఇదీ అంతే. అయితే.. నేను ఏదైతే `ఫక్.` అనే మాటను వాడానో అందుకు క్షమాపణ చెబుతున్నాను. అన్నారు. అదేవిధంగా ఈరోజు టీవీ యాజమాన్యానికి క్షమించమని కోరినట్లు తెలిసింది. అయితే ఇందులో పబ్లిసిటీ వుందో లేదో కానీ.. మొత్తానికి విశ్వక్ సేన్ అనుకున్నట్లు పబ్లిసిటీ వచ్చేసింది. పైగా. నా సినిమాకు నేను ఇలాగే పబ్లిసిటీ చేసుకుంటానని చివర్లో ట్విస్ట్ ఇవ్వడం విశేషం.
ఇదిలా వుండగా, ఈ ఉదంతంపై వర్మ స్పందించారు.ఒక పురుషుడి కన్నా పవర్‌ఫుల్‌గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు' అంటూ ఆ యాంకర్‌ను ట్యాగ్ చేశాడు.