Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుట్టిన‌రోజునాడు నూత‌న చిత్రాలు ప్ర‌క‌టించిన విశ్వ‌క్ సేన్

పుట్టిన‌రోజునాడు నూత‌న చిత్రాలు ప్ర‌క‌టించిన  విశ్వ‌క్ సేన్
, బుధవారం, 30 మార్చి 2022 (13:10 IST)
Katate Raju, Viswak, Bekkem
తొలి చిత్రం `ఈ న‌గ‌రానికి ఏమైంది`లోనే త‌న మార్క్‌ను క్రియేట్ చేసిన న‌టుడు విశ్వ‌క్ సేన్.  యంగ్ ఏజ్‌లోనే నిర్మాత‌గానూ, ద‌ర్శ‌కుడిగానూ మ‌ల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వ‌క్ సేన్ పుట్టిన‌రోజు వేడుక మంగ‌ళవారం రాత్రి అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు విశ్వ‌క్ సేన్ తో చిత్రాలు తీస్తున్న ర‌చ‌యిత‌లు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్‌పై విడుద‌ల చేసిన స్పెష‌ల్ పాట ఆక‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్ రెండు కొత్త‌ చిత్రాల‌ను వెల్ల‌డించారు. ఇప్ప‌టికే `ముఖ చిత్రం`లో ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. యువి.క్రియేష‌న్స్‌లో `గామి` అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఓరి దేవుడా, దాస్ కా ధ‌మ్కీ, లేడీస్ నైట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా ఫ‌ల‌క్ నామా దాస్ 2`, `స్టూడెంట్ జిందాబాద్‌` అనే రెండు నూత‌న చిత్రాల‌ను విశ్వ‌క్‌ ప్ర‌క‌టించారు.
 
webdunia
Viswak sen and his team
విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ, గ‌త ఏడాదినుంచి నేను పుట్టిన‌రోజు చేసుకుంటున్నా. `ఈ న‌గ‌రానికి ఏమైంది`లో న‌టించిన‌ప్పుడు 22 ఏళ్ళే. ఇప్పుడు 27 ఏళ్ళు వ‌చ్చేశాయి. అప్పుడే కాలం ఇంత త్వ‌ర‌గా మారిపోయిందా అనిపిస్తుంది. నా డైలాగ్ ఒక‌టుంది. `ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు ఇక నుంచి మ‌రో ఎత్తు` అలా నా చిత్రాలుంటాయి. అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం చిత్రం అరిటాకుమీద భోజ‌నంలా వుంటుంది. అందులో నాన్‌వేజ్ కూడా వుంటుంది. టీజ‌ర్‌లో చూపించిన‌ట్లు బాటిల్ ప‌గ‌ల‌గానే క‌థ మ‌రో మ‌లుపు తిరుగుతుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ సినిమా. సూర్యాపేట కుర్రాడు గోదావ‌రి వెళితే అక్క‌డ జ‌రిగే క‌థ ఈ సినిమా. ద‌ర్శ‌కుడు విద్యాసాగ‌ర్ అద్భుతంగా తీశాడు. `ఓరి దేవుడా` సినిమా కూడా రెడీగా వుంది. అది కూడా చూస్తే మీరంతా ల‌వ్‌లో ప‌డ‌తారు. అందులో దేవుడి పాత్ర‌ను స్టార్ హీరో చేయ‌బోతున్నాడు. అది ఒక ఫీస్ట్‌లా వుంటుంది. ఇక దాస్ కా ధమ్కీ సినిమా చాలా గొప్ప‌గా వుండ‌బోతోంది. ఆ త‌ర్వాత స్టూటెండ్ లీడ‌ర్‌గా `స్టూడెంట్ జిందాబాద్‌` అనే సినిమా చేయ‌బోతున్నా. ఇక వ‌చ్చే ఏడాది మార్చి 29న ~ఫ‌ల‌క్ నామా దాస్ 2` చిత్రాన్ని ప్ర‌సాద్‌ల్యాబ్‌లోనే ప్రారంభం చేసుకుందాం. పాన్ ఇండియా కాదు కానీ హైద‌రాబాద్‌కూ ముంబైకు లింక్ వున్న క‌థ‌. నాన్న‌గారు మంచి నిర్మాత. చిన్న‌ప్ప‌టినుంచి నాకు మంచి స‌పోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా ద‌గ్గ‌ర అన్ని ర‌కాల వ‌న‌రులున్నాయి. అందుకే బాగా తీయ‌గ‌ల‌ను. ప్ర‌స‌న్న ధ‌మ్కీ క‌థ‌ను బాగా రాశాడు. ఆ క‌థ చెప్పిన‌ప్పుడు నాకు మైండ్ పోయిన‌ట్లు అనిపించిది. అందుకే `మైండ్ పోతుంది లోప‌ల‌` అనే టైటిల్ పెడ‌దామ‌నుకున్నా. కానీ ఫైన‌ల్‌గా దాస్ కా ధమ్కీ అనే  చ‌క్క‌టి టైటిల్ పెట్టాం అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితిన్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్ (టీజర్) విడుద‌ల - జూలై 8న సినిమా రిలీజ్‌