Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్‌ ప్రేక్షకుల కోసమే 'దమ్ముంటే సొమ్మేరా' (Movie Review)

తమిళ కామెడీ స్టార్‌ సంతానం హీరోగా నటించిన చిత్రం "దిల్లుడు దుడ్డు" 2016లో విడుదలైంది. ఆ చిత్రాన్ని తెలుగులో "దమ్ముంటే సొమ్మేరా" పేరుతో అనువదించారు. శుక్రవారం విడుదలైంది. తమిళనాట ప్రముఖ సంస్థ శ్రీ తేనా

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (11:43 IST)
చిత్రం : దమ్ముంటే సొమ్మేరా 
నటీనటులు : సంతానం, అంచల్ సింగ్, కరుణాస్, సురభ్ శుక్లా, ఆనంద్ రాజ్ తదితరులు 
విడుదల : శుక్రవారం, జూన్ 22వ తేదీ 2018
దర్శకుడు : రాంబాలా 
 
తమిళ కామెడీ స్టార్‌ సంతానం హీరోగా నటించిన చిత్రం "దిల్లుడు దుడ్డు" 2016లో విడుదలైంది. ఆ చిత్రాన్ని తెలుగులో "దమ్ముంటే సొమ్మేరా" పేరుతో అనువదించారు. శుక్రవారం విడుదలైంది. తమిళనాట ప్రముఖ సంస్థ శ్రీ తేనాండాళ్‌ ఫిలిమ్స్‌ నిర్మించింది. రాంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగునాట శ్రీకష్ణా ప్రొడక్షన్స్‌ పతాకంపై నటరాజ్‌ అందిస్తున్నారు. సంతానం సరసన అంచల్‌ సింగ్‌ (షనన్య)నటించగా ఇతర పాత్రల్లో కరుణాస్‌, సురబ్‌ శుక్లా, ఆనంద్‌ రాజ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని గురువారమే విలేకరులకు చూపించారు. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
బ్రిటీష్‌కాలంనాటి రాజరిక వ్యవస్థతో శివగంగ పర్వతం మీద బంగ్లాలో వున్న ఓ రాజు కథతో ప్రారంభమవుతుంది. రాజుకు బహుమతిగా బ్రిటీష్‌ ఇచ్చిన బంగ్లా కాలక్రమేణా శిథిలమవుతుంది. అక్కడ రాజు భార్య, కుమారుడు ఆత్మలుగా తిరుగుతూ భయపెడుతున్నారనేది కథ. ఇక కట్‌ చేస్తే.. ఇప్పటికాలంలో కుమార్‌(సంతానం) సిటీలో బేవార్స్‌గా తిరుగుతుంటాడు. తండ్రి సినిమాల్లో డూప్‌ వేషాలు వేస్తూ బతికేస్తుంటాడు. అయితే చిన్నతనంలోనే కుమార్‌కు ఓ లవ్‌ట్రాక్‌ ఉంటుంది. తను ఇష్టపడిన కాజల్‌ (షనాయా)ని పెద్దయ్యాక చిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుంటాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఇష్టంలేని కాజల్‌ తండ్రి (సౌరభ్‌ శుక్లా) కుమార్‌ని హత మార్చడానికి ఒక రౌడీ దగ్గరికి వెళతాడు. దాంతో ఎవరినీ అనుమానం రాకుండా కుమార్‌ని హతమార్చాలంటే పాడుపడిన బంగ్లా ఉన్న శివగంగ పర్వతానికి తీసుకెళతాడు. అక్కడే ఇద్దరి పెళ్లి చేయిస్తానని నమ్మి వచ్చిన కుమార్‌ ఫ్యామిలీకి చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అవి ఏమిటి? కుమార్‌ పెళ్లిచేసుకున్నాడా? లేదా? అసలు దెయ్యాలు ఏమయ్యాయి? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
బాషాభేదం లేకుండా హారర్‌ కామెడీ జోనర్‌లు నిర్మాతకు మంచి ఫలితాల్ని ఇస్తాయి. భయపెట్టి వినోదాన్ని పండించే చిత్రాలు చాలానే వచ్చాయి. ఒక్కో కథది ఒక్కో పంథా. కామెడీ నటుడు సంతానాన్ని హీరోగా చేసి తీశారంటే వినోదం ఉండాల్సిందే. అల్లరి నరేష్‌.. చేసిన 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం' చిత్రం అలాంటిదే. నేపథ్యం వేరైనా భయపెట్టి వినోదాన్ని పంచడమే సంతానం చిత్రంలోని కథాంశం. అయితే కథ మొదలు భారీ చిత్రాన్ని తీసుకున్నట్లుగా.. సెవెన్త్‌సెన్స్‌ తరహాలో ఓ పెద్ద కథను చెప్పి., దానికి సంతానం పాత్రకు ఎలా లింకుచేశారనేది మొదట ఆసక్తిగా అనిపిస్తుంది. అయితే రానురాను గమనంలో చూస్తే అంత ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ అవసరంలేదనిపిస్తుంది.
 
హీరో హీరోయిన్లు పెళ్లిచేసుకోవడానికి ఆ బంగ్లాలోకి రావడం, అక్కడ డూప్‌క్లేట్‌ దయ్యాలతో జరిగే కామెడీ అన్నింటిని కూడా డిఫరెంట్‌ అప్రోచ్‌లో ఫ్రెష్‌ లుక్‌ వచ్చింది. ఆ తర్వాత నిజం దెయ్యం రాకతో కథ మరింత ఆసక్తిగా మారింది. చివరి 20 నిముషాల సేపు కథ చాలా ఆసక్తిగా వుంటుంది. రొటీన్‌ ఫార్మెట్‌లో స్టార్ట్‌ అయిన ఒక లవ్‌ స్టోరీ, తమిళ్‌ నేటివ్‌ టచ్‌ ఉన్న కామెడీ తెలుగువారికి కొత్తగా ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌ లవ్‌ మ్యాటర్‌ హీరోయిన్‌ ఫాదర్‌‌కి తెలిసిన దగ్గర నుంచి కథలో చలనం వచ్చింది. పెళ్లి చూపులు సీన్‌ నుండి స్టార్ట్‌ అయిన కంటెంట్‌ కామెడీ కూడా బాగా నవ్విస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ముందు వచ్చే ఎపిసోడ్స్‌ థ్రిల్లింగ్‌‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌‌ని రొటీన్‌‌గాకాకుండా కొత్తగా ముగించడం కూడా బావుంది.
 
నటనాపరంగా సంతానం కామెడీ చేయడానికి కన్నా ఎక్కువగా కథను నడిపించే హీరోగానే కనిపించాడు. అయితే అతని మేనరిజం ఎక్కువగా రజినీకాంత్‌ను పోలివున్నట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌ కాజల్‌గా కనిపించిన షనాయా ఫర్వాలేదనిపిస్తుంది. ఫెర్ఫార్మెన్స్‌ కూడా ఫర్లేదు. హీరోయిన్‌ ఫాదర్‌గా కనిపించిన సౌరభ్‌ శుక్లా నటన సినిమాకి ప్లస్‌ అయ్యింది. కార్తీక్‌‌తో కలిసి అతను పండించిన కామెడీ బావుంది. అలాగే కామెడీ రౌడీగా సినిమాని నిలబెట్టేసాడు. రెండో అర్థభాగం మొత్తాన్ని అతనే టేక్‌ ఓవర్‌ చేసి పూర్తిస్థాయిలో హాస్యాన్ని పండించాడు. కరుణాస్‌, ఆనంద్‌ రాజ్‌‌తో సహా అందరూ బాగా నటించి సినిమాకి ప్లస్‌ అయ్యారు. 
 
ఇకపోతే, సాంకేతికపరంగా చూస్తే సినిమాటోగ్రాఫర్‌ దీపక్‌ కుమార్‌ పనితనం చెప్పుకోవాలి. అతను డైరెక్టర్‌తో కలిసి అతని ఆలోచనలను అర్థం చేసుకుని ఓట్‌పుట్ ఇవ్వడం వల్ల ఎక్కడా గందరగోళం లేకుండా సాగిపోయింది. కార్తీక్‌ రాజా అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌. ఎక్కడికక్కడ సినిమా మూడ్‌‌ని ఎలివేట్‌ చేస్తూ అతను ఇచ్చిన ఆర్‌.ఆర్‌ ప్రతి ఒక్క సీన్‌‌ని ఎలివేట్‌ చేసింది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీత బాణీలు సమకూర్చారు. రెండు ఫుల్‌ సాంగ్స్‌, ఒక బిట్‌ సాంగ్‌ కూడా అంతగా ఆకట్టుకోవు. గోపికృష్ణ ఎడిటింగ్‌ బాగుంది. అయితే చిత్ర టైటిల్‌ మాస్‌ హీరోగా నిలదొక్కుకోవడానికి హీరోపైనే పెట్టినట్లుంది. మొత్తంగా చూస్తే మాస్‌ ప్రేక్షకుల్ని అలరించే చిత్రమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments