Webdunia - Bharat's app for daily news and videos

Install App

`లవ్ స్టోరి` యూనిట్‌కు కోవిడ్ ఇన్సూరెన్స్ చేయించిన నిర్మాత‌లు

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:39 IST)
Sekhar kammula, chaitu
వీలైన అన్ని జాగ్రత్తల ద్వారా కరోనా వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకుంది "లవ్ స్టోరి" సినిమా టీమ్. దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుచూపు దాదాపు వందమంది యూనిట్ మెంబర్స్ ను కరోనా బారిన పడకుండా చేసింది. లాక్ డౌన్ తర్వాత "లవ్ స్టోరి" సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలైంది. సగం మంది యూనిట్ తోనే షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాదాపు 200 మంది ఉండాల్సిన యూనిట్ 100 తోనే సర్దుకుపోవాల్సి వచ్చింది.

టీమ్‌లో ఒకరికి కరోనా వచ్చినా అందరికీ ప్రమాదమే. ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు శేఖర్ కమ్ముల పక్కా ప్రణాళిక అనుసరించారు. ముందుగా సెట్ మొత్తం శానిటైజ్ చేసేవారు. ఆ తర్వాత సెట్ లోకి అడుగుపెట్టే ముందే ప్రతి ఒక్క యూనిట్ సభ్యుడిని శానిటైజ్ చేసేవారు. షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రెండు రోజు ముందే ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా టెస్ట్ లు నిర్వహించేవారు. ఫలితం నెగిటివ్ వస్తేనే చిత్రీకరణకు అనుమతించారు. చాలా మంది సినిమా యూనిట్స్ యాంటీజన్ పరీక్షలు నిర్వహించాయి. వీటిలో ఫలితం నిర్థారణలో 50 శాతం వరకే ఖచ్చితత్వం ఉంటుంది. ఆర్టీపీసీఆర్ తో పూర్తి ఫలితం తెలుస్తుంది. యూనిట్ అందరికీ ఆర్టీపీసీఆర్, శానిటైజ్, మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్ లు కూడా ఇచ్చారు.
 
కరోనా వ్యాప్తి జాగ్రత్లతో పాటు పుష్టికరమైన ఆహారాన్ని లవ్ స్టోరి సెట్ లో అందించేవారు. ప్రతి రోజూ గుడ్లు, పాలు , పండ్లు అందజేశారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి మల్టీ విటమిన్ టాబ్లెట్లు ఇచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే బౌన్సర్లతో సహా మొత్తం 24 క్రాఫ్టులలోని యూనిట్ మెంబర్స్ 95 మందికి కొవిడ్ ఇన్యూరెన్స్ చేయించారు. 3 లక్షల రూపాయల కవరేజ్ ఉండే ఈ ఆరోగ్య బీమా కేవలం కొవిడ్ కోసమే. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే ఖర్చంతా రీయింబర్స్ మెంట్ చేసుకోవచ్చు.
 
మన ప్రయత్నం బాగుంటే టైమ్ కూడా కలిసి వస్తుందని అన్నట్లు లవ్ స్టోరి సినిమా షూటింగ్ మొత్తంలో ఏ ఒక్కరికీ కొవిడ్ రాలేదు. ఈ ఇన్యూరెన్స్ ఉపయోగించుకునే పరిస్థితి రాలేదు. కానీ షూటింగ్ జరిగినన్ని రోజులు చిత్ర బృందం అంతా ధైర్యంగా పనిచేశారు. ఏదైనా అయితే ఇన్సూరెన్స్ ఉందనే విషయం వారికి ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ బీమా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగనుంది.
 
శానిటైజ్, మాస్కులు, ఫేస్ షీల్డ్స్, హెల్దీ ఫుడ్, మల్టీ విటమిన్ టాబ్లెట్స్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిసి 50 లక్షల రూపాయల దాకా  లవ్ స్టోరి నిర్మాతలు భరించారు. మనిషి ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదన్నది వారి ఆలోచన. హడావుడిగా సినిమా షూటింగ్ లు చేసి, ఎవరికో ఒకరు వైరస్ బారిన పడగానే మొత్తం షూటింగ్ ఆపేసే చిత్ర బృందాలకు లవ్ స్టోరి సినిమా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు, చేసిన ప్రయత్నం... ప్రశంసనీయం, అనుసరనీయం, స్పూర్తివంతం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments