Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృతి మించుతున్న టాప్ ఛానల్ డ్యాన్స్ షో... చూడండి గురూ అంటున్నారు...

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (17:27 IST)
బుల్లితెర షోలలో డ్యాన్స్ షోలకు అభిమానులు ఎక్కువే. అందులోను ఈటీవీ లాంటి ఛానళ్ళు టెలికాస్ట్ చేసే డ్యాన్స్ షోలంటే అభిమానులు పడి చచ్చిపోతుంటారు. ఢీ డ్యాన్స్ షోకి అభిమానులు లక్షలాదిమందే ఉన్నారు. ఈ షోకు రెగ్యులర్‌గా చూసే అభిమానులు లేకపోలేదు. అయితే ఆ షోలో ఈ మధ్య శృంగార సన్నివేశాలు కనిపిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. న్యాయనిర్ణేతలే ఆశ్చర్యపోయేలా కొన్ని డ్యాన్స్ షోలు నడుస్తున్నాయి.
 
ఏదో చేద్దామని కొంతమంది డ్యాన్సర్లు రెచ్చిపోయి నృత్యం చేస్తున్నప్పుడు శృంగార భంగిమలు కనిపిస్తున్నాయంటున్నారు. దీంతో ఆ షో కాస్త విమర్శలను ఎదుర్కొంటోంది. గతంలో ఇలాంటి కొన్ని షోలను బ్యాన్ కూడా చేసేశారు. ఇప్పుడు ఈ షో వంతు వచ్చిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ షోలో ఉన్న యాంకర్లు సుధీర్, రేష్మిలు అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందులో ఉన్న సన్నివేశాలను కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని చూడలేకపోతున్నారు. ఇలాంటివి శృతి మించక ముందే షో నిర్వాహకులు స్పందించాలంటూ కొంతమంది అభిమానులు ఆ టీవీ యజమానులకు మెసేజ్‌లు పంపుతున్నారట. లక్షలాది మంది అభిమానులు చూస్తున్న ఈ షోను నడుపుతారో లేక అందులో పార్టిసిపేట్ చేస్తున్న వారికి క్లాస్ పీకుతారో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments