Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య‌కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న వ‌ర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'‌...(Video)

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:49 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ లేటెస్ట్ సెన్సేష‌న్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రం ట్రైల‌ర్‌ను రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. న‌మ్మితేనే క‌దా మోసం చేసేది అంటూ ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ నా మొత్తం జీవితంలో చేసిన త‌ప్పు వాడిని న‌మ్మ‌డం అనే డైలాగ్‌తో ముగుస్తుంది.
 
1989లో ఎన్టీఆర్ ఓడిపోయిన త‌ర్వాత ప‌రిస్థితులు, ల‌క్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలో వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లు.. ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు త‌దిత‌ర విష‌యాల‌న్నింటిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. 
 
గంట‌న్న‌ర‌లోనే 1 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ సంచ‌ల‌నం సృష్టించింది. జీవీ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమాకి క‌ళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌ల‌తో పాటు చంద్ర‌బాబు ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాత్ర‌ల‌కు ఎంచుకున్న న‌టీన‌టులు క‌రెక్ట్‌గా సెట్ అయ్యారు. 
 
ఈ సినిమాతో వ‌ర్మ ఈజ్ బ్యాక్ అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తుండ‌టంతో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఈ సినిమాకి వ‌స్తోన్న క్రేజ్ చూసి బాల‌య్య తెగ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. మొత్తానికి బాల‌య్య‌కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు వ‌ర్మ‌. మ‌రి... రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో..? ఎలాంటి వివాదాల‌కు తెర తీస్తుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ను ఆడకుండా చేయాలని చూస్తున్నారు, నేను చూస్తాను: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments