ప్రభాస్ "సలార్" ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (09:41 IST)
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకుడు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగం డిసెంబరు 22వ తేదీన రానుది. దీంతో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ముహూర్తాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసింది. 
 
హోంబలో ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్తగా మరో పోస్టర్‌ను వదిలారు. పూర్తిగా యాక్షన్‌లోకి దిగిపోయిన ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.
 
ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, గరుడ రామచంద్రరాజు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. స్పెషల్ సాంగ్‌లో సిమ్రత్ కౌర్ మెరవనుంది. రవి బస్రూస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Caught on camera: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి.. ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టేందుకు? (video)

అన్నమయ్య జిల్లాలో చెల్లెలిపై అన్న లైంగిక దాడి, మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక

ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఏడేళ్ల సోదరుడి ముందే గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం

మహిళలకు నెలసరి సెలవు మంజూరు - కర్నాటక మంత్రివర్గం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments