రెండు భాష‌ల‌కు డబ్బింగ్ పూర్తిచేసిన‌ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (18:08 IST)
Ntr- charan(fc)
ఆర్ఆర్ఆర్ మూవీ రెండు పాట‌లు మిన‌హా మిగిలిన టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ పాట‌ల చిత్రీక‌రణ‌తో ఎంటైర్ షూటింగ్ పూర్త‌వుతుంది. మ‌రోవైపు ‘ఆర్ఆర్ఆర్‌’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగానే బైక్‌పై ఇద్ద‌రు వెళుతున్న ఫొటోను చిత్ర యూనిట్ నేడు విడుద‌ల చేసింది. త్వ‌ర‌లోనే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను కూడా పూర్తి చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. 
 
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్ఠార్స్ అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. సెట్స్‌లో కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ త‌గు జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటూ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకున్నారు రాజ‌మౌళి అండ్ టీమ్‌. 
 
ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అన్ని భాష‌ల‌కు చెందిన పాన్ ఇండియా న‌టీన‌టులు న‌టిస్తున్నారు. రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కొవిడ్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments