Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2లో నటిస్తున్నా.. అదీ దేవసేనకు మంత్రిగా... పృథ్వీరాజ్

నంద‌మూరి బాల‌కృష్ణ‌ని అనుక‌రిస్తూ తాను క్యారెక్ట‌ర్‌లు చేశాన‌ని, బాల‌కృష్ణ‌తో క‌లిసి కూడా ఓ సినిమాలోనూ న‌టించాన‌ని హాస్యనటుడు పృథ్వీ అన్నాడు. క‌థ‌లో భాగంగా తాను హాస్యం చేస్తాన‌ని, తాను అనుక‌రిస్తోన్న

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (10:34 IST)
నంద‌మూరి బాల‌కృష్ణ‌ని అనుక‌రిస్తూ తాను క్యారెక్ట‌ర్‌లు చేశాన‌ని, బాల‌కృష్ణ‌తో క‌లిసి కూడా ఓ సినిమాలోనూ న‌టించాన‌ని హాస్యనటుడు పృథ్వీ అన్నాడు. క‌థ‌లో భాగంగా తాను హాస్యం చేస్తాన‌ని, తాను అనుక‌రిస్తోన్న హీరోల‌ ఇమేజ్ పెరిగేలా ఉంటుందే కానీ, వారి ఫ్యాన్స్ నొచ్చుకునేలా మాత్రం ఉండ‌ద‌ని అన్నారు. ఓ సినిమాలో ప్ర‌భాస్ బాహుబ‌లి పాత్ర‌ను అనుకరిస్తూ చేసినందుకు త‌న‌కు ఆ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చివాట్లు పెట్టార‌ని వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అస‌త్యాలేన‌ని, మ‌సాలా చ‌ల్లి కొందరు అలా రాశార‌ని చెప్పాడు.
 
ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే? ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న‌ బాహుబలి-2 సినిమాలో తాను కూడా న‌టిస్తున్నాన‌ని, దేవసేన పాత్ర వేసిన అనుష్కకు మంత్రిగా క‌నిపిస్తాన‌ని పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బాహుబలి పార్ట్ 1 క‌న్నా పార్ట్ 2 పై ప్రేక్ష‌కుల్లో ఎన్నో అంచ‌నాలు ఉన్నాయ‌ని తెలిపాడు. 
 
దేవసేన సామ్రాజ్యంలో తాను కూడా ఉంటాన‌ని చెప్పాడు. ఆ సినిమాలో మాత్రం తాను కామెడీ క్యారెక్ట‌ర్ చేయ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు.  బాహుబ‌లి షూటింగ్‌కు వెళితే ఇంటికి వెళ్లిన‌ట్లే ఉంటుంద‌ని చెప్పాడు. గ‌తేడాది తాను చిరంజీవితో క‌లిసి ప‌నిచేశాన‌ని, దర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు సినిమాలోనూ న‌టించానని అన్నాడు. తాను ఈ ఏడాది ఫుల్ లెంత్ హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాన‌ని అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments