Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నాపై ప్రేమ కాదు... డబ్బుల కోసం నన్ను నానా హింసలు పెట్టాడు : చెర్రీపై చిరంజీవి పంచ్

తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. "ఖైదీ నంబర్ 150"వ చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి... నిర్మాతపై కనకవర్షం కురిపిస్తున్నారు. అయితే, తన

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (10:29 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. "ఖైదీ నంబర్ 150"వ చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి... నిర్మాతపై కనకవర్షం కురిపిస్తున్నారు. అయితే, తన తనయుడైన ఖైదీ చిత్ర నిర్మాత రామ్ చరణ్‌కు నాన్నపై ఉండే ప్రేమ కంటే.. డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉందనీ, అందువల్ల తనను నానా హింసలు పెట్టినట్టు చిరంజీవి తన తనయుడిపై పంచ్‌లు వేశాడు.
 
సంక్రాంతి పండుగ రోజున 'ఖైదీ నంబర్ 150' హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు వివి.వినాయక్‌లతో నాగబాబు కుమార్తె నీహారిక యాంకర్‌గా ఓ టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో చిరంజీవిని నీహారిక అడిగిన ఓ ప్రశ్నవేసింది. "డాడీ... నీ ఫిట్నెస్ మంత్రం ఏంటో చెబితే, నేను కూడా మా నాన్నకు చెప్పి, ఫిట్ చేసుకుంటా" అని నీహారిక తన పెదనాన్న చిరంజీవిని అడిగింది. 
 
నీహారిక అడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేసిన చిరంజీవి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమన్నారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్ ఫుడ్, ఎక్సర్ సైజుల గురించి నిత్యమూ పర్యవేక్షిస్తుండే వారని, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటూ, నిత్యమూ వ్యాయామంతో బరువు తగ్గించుకుంటూ వచ్చానని అన్నారు.
 
"నిత్యమూ నా కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సపోర్ట్, ప్రేమతో... నా పని సులువైంది. ఇదంతా ఆలోచిస్తుంటే... అబ్బా, నా మీద ఎంత ప్రేముంది అనుకునేవాడిని. కానీ, ప్రేమ కాదు... వాడు సినిమా నిర్మాత. సో, హీరో బాగుంటేనే కదా, నాలుగు డబ్బులు వస్తాయని, డబ్బు మీద మమకారంతో వీడు నన్ను నానా హింసలూ పెట్టాడు. ఈ విషయం నాకు తర్వాత అర్థమైంది" అని చిరంజీవి నవ్వుతూ అన్నారు. 

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments