Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని ఆ రకం కాదు.. షూటింగ్‌కు వస్తే పనేంటో చూసుకుపోతాడు.. అలీ

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (16:52 IST)
రచయిత పోసాని కృష్ణమురళిపై ప్రముఖ హాస్యనటుడు అలీ ప్రశంసల వర్షం కురిపించారు. పోసాని మంచి మనసుకు మెచ్చి ఆ భగవంతుడు నాయక్ చిత్రంతో బ్రేక్ ఇచ్చాడని, అక్కడ్నించి కమెడియన్‌గా పోసాని ప్రస్థానం అందరికీ తెలిసిందన్నారు. తాజాగా పోసాని తెరకెక్కిస్తున్న 'ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు' సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో అలీ కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు తెలిసిన పోసానిపై ప్రశంసల వర్షం కురిపించారు. పోసాని ఎంతోమందికి సాయం చేసినా ఎవరికీ చెప్పుకోడని అన్నారు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే రకం కాదన్నారు. షూటింగ్‌కు వస్తే తన పని తాను చేసుకుపోతాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న కమెడియన్లలో పోసాని స్థానం కంటే అతడి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనదని అలీ స్పష్టం చేశారు. 
 
తాను నిర్మాతగా కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా డబ్బులేకపోతే ఉన్నదంతా అమ్ముకుని అయినా ఆర్టిస్టులకు చెల్లింపులు చేశాడే తప్ప ఏనాడూ ఒక్కరికి కూడా పారితోషికం ఎగ్గొట్టలేదని వెల్లడించారు. తన కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండటంతో ఏదో ఒకటి చేయాలనే కసితో చెన్నై వచ్చి తన పెన్నును, ఇంకును నమ్ముకుని పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంటుగా కొన్నేళ్లు పని చేసి, పోలీస్ బ్రదర్స్ చిత్రం ద్వారా రచయితగా మారారి పాపులర్ అయ్యాడని అలీ గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments