ఎవరైనా 70 కేజీల రాయిని ఎత్తమంటే కొంత మంది ఎత్తలేకపోయినా దేహ దారుఢ్యం ఉన్న వ్యక్తులకు ఇది ఒక లెక్క కాదు. అలా కాకపోతే సాధారణమైన వ్యక్తులు నలుగురు కలిసి ఎత్తవచ్చు. కానీ శివ్‌పూర్‌లోని హజరత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉన్న రాయిని ఎత్తాలంటే ఖచ్చితంగా 11 మంది అవసరం. సంఖ్యలో ఏ ఒక్కరు తగ్గినా రాయి పైకి లేవదు.
దానిని పైకి లేపడానికి వారు వారి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. చూపుడు వేళ్లు రాయిపై పెట్టి సూఫీ మతగురువు పేరు చెబితే దానంతట అదే పైకి తేలుతుంది. స్థానికుల కథనం మేరకు దాదాపు 800 సంవత్సరాల క్రిందట ఖమర్ అలీ ఆ రాయిని శపించాడట. అప్పటి నుండి ఆ రాయిని లేపాలంటే 11 మంది కావాల్సిందే. చూపుడు వేళ్లు పెట్టి ఖమర్ అలీ అనే పేరు చెప్పాల్సిందే.