Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేసికల్లీ.. క్యాస్టింగ్‌ కౌచ్‌కు నో చెప్పినా.. ఎస్ చెప్పినా... "కలర్స్" స్వాతి

తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న తెలుగు అమ్మాయి కలర్స్ స్వాతి. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ,

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (17:17 IST)
తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న తెలుగు అమ్మాయి కలర్స్ స్వాతి. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ, సాధారణంగా పవర్‌ స్ట్రగుల్‌ అనేది మన ఇంట్లోనే ఉంటుంది. వర్క్‌ ప్లేస్‌లో ఎందుకు ఉండదు? ఎవరూ డైరెక్టుగా మాట్లాడరు. చాలా తెలివిగా, స్మూత్‌గా, జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారని తెలిపింది.
 
బేసికల్లీ... 'నో' చెబుతాం. అంతే... 'ఆ అమ్మాయితో వర్క్‌ చేయడం చాలా కష్టమండీ! ఆ అమ్మాయి అంత ఫ్రెండ్లీ కాదండీ!' అని వీళ్లు ఏదేదో చెబుతారు. హ్యూమన్‌ మెంటాలిటీ అది! మనం ఏం చేసినా మనుషులు మాట్లాడతారు. సాధారణంగా అమ్మాయి క్యాస్టింగ్‌ కౌచ్‌కి 'యస్' చెప్పినా... 'నో' చెప్పినా... ఆమె గురించి మాట్లాడటం మానరని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాకుండా, ఇతర రంగాల్లో ఉన్నట్టుగానే సినీ ఇండస్ట్రీలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది కూడా క్యాస్ట్ ఫీలింగ్ టైపే. 'నేను బ్రాహ్మిణ్‌ లేదా చౌదరి లేదా మరో క్యాస్ట్‌! మీది సేమ్‌ క్యాస్ట్‌ కదా. మీ సినిమాలోకి నన్నే తీసుకోండి' అన్నట్టుంది. అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినవాళ్ల ఫ్రస్ట్రేషన్‌ అర్థం అవుతుంది. కానీ, ప్రాక్టికల్‌గా వర్కవుట్‌ కాదన్నారు. 
 
సినిమా అనేది సీరియస్‌ బిజినెస్‌. నిర్మాతలు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని ఆశిస్తారు. వాళ్లు నువ్వు తెలుగమ్మాయివో? మంచి అమ్మాయివో? అని అవకాశాలు ఇవ్వరు. ఒక పాత్ర తెలుగమ్మాయి మాత్రమే చేయగలదు, తెలుగమ్మాయి అయితేనే న్యాయం చేస్తుందని అంటే వేరే విషయం. కానీ, ప్రతి సినిమాలోనూ అవకాశం ఇవ్వాలని అనుకోవడం సరికాదని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments