Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌లర్స్ స్వాతి రెడ్డి ఇడియట్స్ ఫస్ట్ లుక్ విడుదల

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (17:11 IST)
Swathi Reddy
ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా, రావణాసురుడు, డెవిల్ వంటి భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకీ ప్రాధాన్యత ఇస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ నుండి తాజా ప్రొడక్షన్ వెంచర్ అమోఘ ఆర్ట్స్, ఎమ్‌ఎన్‌ఓపి కలిసి నిర్మిస్తున్న  చిత్రానికి 'ఇడియట్స్' అనే క్రేజీ టైటిల్ ని ఖారారు చేశారు. రియల్ హీరోస్ అనేది ఉప శీర్షిక. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలైంది.
 
కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఇడియట్స్'.. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక అంశాలతో కూడిన స్వచ్చమైన ప్రేమకథగా ఉండబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రముఖ తారాగణం అంతా క్యారికేచర్‌ డిజైన్ లో ప్రతి పాత్ర విభిన్న భావోద్వేగాలతో కనిపించడం గమనించవచ్చు. స్వాతితో పాటు నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష మరికొన్ని పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించాయి. పల్లెటూరి నేపధ్యంలో ఫస్ట్ లుక్ ప్లజంట్ గా వుంది.  
 
ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా, సిద్దార్థ్ సదాశివుని సంగీత దర్శకుడిగా,  అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రాఫర్ గా, అరుణ్ తాచోత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: కలర్ స్వాతి రెడ్డి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష, నిత్య శ్రీ, సురేష్, రాజేంధర్ గౌడ్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments