Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలను వెర్రివెంగళప్పలను చేశారు.. అన్నాడీఎంకే విలీనంపై కమల్ ట్వీట్

తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలు విలీనం కావడంపై సినీ హీరో కమల్ హాసన్ తనదైనశైలిలో స్పందించారు. ఇదే అంశంపై ఆయన తన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (06:27 IST)
తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలు విలీనం కావడంపై సినీ హీరో కమల్ హాసన్ తనదైనశైలిలో స్పందించారు. ఇదే అంశంపై ఆయన తన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తమిళ ప్రజలను వెర్రివాళ్లను చేసిన దేశంలో ఉన్న అన్ని రకాల టోపీలను పెట్టారంటూ వ్యాఖ్యానించారు. 
 
సోమవారం అన్నాడీఎంకేలోని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటైన విషయం తెల్సిందే. ఈ తాజా రాజకీయ ప‌రిణామాల‌పై క‌మ‌లహాస‌న్ స్పందించారు. 
 
పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మిళ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం వెర్రివాళ్ల‌ను చేస్తోంద‌ని ఆయ‌న కామెంట్ చేశారు. త‌మిళుల త‌ల మీద గాంధీ టోపీ, కాషాయం టోపీ, కాశ్మీర్ టోపీల‌తో పాటు ఇప్పుడు జోక‌ర్ టోపీ కూడా పెట్టార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
 
కాగా, సోష‌ల్ మీడియా ద్వారా త‌మిళ రాజకీయాల‌పై ప్ర‌భావం చూపించ‌డానికి ప్ర‌భుత్వ ప‌నితీరుపై స్పందించాల్సిందిగా త‌న అభిమానుల‌ను క‌మ‌ల్ ఉసిగొల్ప‌డంపై త‌మిళ ప్ర‌భుత్వం ఒకింత‌ అస‌హ‌నంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పైగా, కమల్ ట్వీట్లపై మంత్రులు కూడా తమకుతోచిన విధంగా స్పందిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments