Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియాలిటీకి దగ్గరగా కృష్ణగాడు అంటే ఒక రేంజ్: చిత్ర యూనిట్

Webdunia
బుధవారం, 12 జులై 2023 (15:31 IST)
Rishvi Thimmaraju, Vismaya Sri
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా ఓ డిఫరెంట్ యాంగిల్ లవ్ స్టోరీగా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' సినిమా రూపొందుతోంది. సరికొత్త కథ, కథనంతో నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు పొందుపరుస్తూ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 
  
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని లాగేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ ఫీల్ గుడ్ ప్రేమ కథపై జనాల్లో క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ వస్తున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్ మెప్పు పొందుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. 
 
రియాలిటీకి దగ్గరగా ఉండే కథతో రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జానర్లను టచ్ చేయబోతున్నారు. పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ యువ హృదయాల మనసు దోచేలా ఈ మూవీలోని సన్నివేశాలు ఉండనున్నాయట. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ ఈ సినిమాలో హైలైట్ అవుతాయని అంటున్నారు. 
 
ఈ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు.  వరికుప్పల యాదగిరి పాటలు రచించారు. గురి చూసి ఒక్కటే దెబ్బలో కొట్టేస్తా అంటూ రంగంలోకి దిగిన ఈ కృష్ణ గాడు తన రేంజ్ చూపించడానికి రెడీగా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments