Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివకార్తికేయన్, అదితి శంకర్ ల మహావీరుడుకు రవితేజ వాయిస్ ఓవర్

Advertiesment
Raviteja voice over
, బుధవారం, 12 జులై 2023 (11:48 IST)
Raviteja voice over
శివకార్తికేయన్ కథానాయకుడిగా మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన హిలేరియస్ పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మహావీరుడు ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. విడుదల తేదీ సమీపిస్తున్నందున మేకర్స్ మరింత జోరుని పెంచారు. 
 
ఈ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. శివకార్తికేయన్ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అతను ఏదో ఒక ప్రత్యేక శక్తి నుండి గైడెన్స్ కోరుతున్నట్లుగా ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు ఓ పవర్ లో “ధైర్యమే జయం” అంటూ రవితేజ వాయిస్ వినిపించడం ఆసక్తికరంగా వుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.
 
''రవితేజ సార్ మా సినిమాలో మీ ఎనర్జిటిక్ వాయిస్ అందించడం చాలా ఆనందంగా ఉంది. మహావీరుడు టీమ్‌కి మీరు అందించిన సపోర్ట్‌కి చాలా కృతజ్ఞతలు సార్. జూలై 14 నుండి  మహావీరుడు. ధైర్యమే జయం" అని శివకార్తికేయన్ ట్వీట్ చేశారు.
 
ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. ఈ చిత్రంలో యోగి బాబు, సరిత వంటి స్టార్ తారాగణం కూడా ఉంది.
 
ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైవా హర్ష హీరోగా మాస్ మహారాజ రవితేజ నిర్మిస్తున్న చిత్రం సుందరం మాస్టర్