Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయన్ని చూస్తునపుడు చిన్న రజనీ లా అనిపిస్తారు : మహావీరుడు ప్రీ రిలీజ్ లో సరిత

Saritha, Siva Karthikeyan, Adivi Shesh, Shekhar Kammula, Adithi Shankar
, సోమవారం, 10 జులై 2023 (10:22 IST)
Saritha, Siva Karthikeyan, Adivi Shesh, Shekhar Kammula, Adithi Shankar
హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా, మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్' మహావీరుడు. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 14న మహావీరుడు విడుదల కానున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో అడివి శేష్, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
 
శివ కార్తికేయన్ మాట్లాడుతూ..శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్ సినిమా నాకు చాలా ఇష్టం. అడవి శేష్ ని చూస్తునపుడు ఒక బ్రదర్ లా అనిపిస్తారు. కథ కుదిరితే తనతో కలసి నటిస్తాను. గూడచారి 2 కోసం ఎదురుచూస్తున్నాను. అనుదీప్ కి థాంక్స్. మహావీరుడు ఫాంటసీ జోనర్. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు అశ్విన్ బ్రిలియంట్ గా తీశారు. సునీల్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.  అదితి   చక్కగా నటించింది. సరిత గారితో పని చేయడం ఆనందంగా వుంది. ఏసియన్ సునీల్ గారికి, జాన్వి కి కృతజ్ఞతలు. ఈ సినిమాలో చాలా మంచి సర్ప్రైజ్ వుంది. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని  తెలిపారు.  
 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల గారు నా గురువు.  శివకార్తికేయన్ గారిని ఓ పెళ్లిలో కలిసినప్పుడు చాలా కాలంగా తెలిసిన ఒక స్నేహితుడిలా కౌగిలించుకొని హలో చెప్పారు. ఆయనతో కలసి పని చేయాలని వుంది. అశ్విన్ మొదటి సినిమా మండేలా చూసినప్పుడు ఆయనతో వర్క్ చేస్తే బావుండని అనుకున్నాను. ఆయన దగ్గరికి క్షణం రీమేక్ వెళ్ళిందని తెలిసి ఆనందంగా వుంది.  ఈ సినిమా ని తెలుగు సినిమాలానే చూడాలి. మొత్తం టీం వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. అందరం సపోర్ట్ చేయాలి. జులై 14న అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు.
 
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, మహావీరుడు ట్రైలర్ విజువల్స్ గొప్పగా వున్నాయి. సరిత గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ప్రేమ కథ అంటే మరో చరిత్ర. మ్యూజిక్ అంటే మరో చరిత్ర. సరిత గారితో కలసి వేదిక పంచుకోవడం ఆనందంగా వుంది. నిర్మాత అరుణ్ కి బెస్ట్ విషెస్. సునీల్ నారంగ్ గారు, జాన్వీ, భరత్ ,  టీం అందరికీ ఆల్ ది బెస్ట్ . మహావీరుడు లో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు
 
అధితి   శంకర్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సరిత గారితో పని చేయడం ఆనందంగా వుంది. శివ కార్తికేయన్ గారు వండర్ ఫుల్ కో స్టార్. ఇందులో అద్భుతంగా నటించారు. మహావీరుడు జులై 14న విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూడాలి’అని కోరారు.
 
దర్శకుడు మడోన్ అశ్విన్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్ చిత్రానికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు.  ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. అనుదీప్ అంటే నాకు చాలా ఇష్టం. తన ఇంటర్వ్యూలు చూస్తుంటాను. మండేలా కి ముందు అడివి శేష్ గారి క్షణం సినిమా రీమేక్ చేసే అవకాశం వచ్చింది. దర్శకుడిగా నాకు వచ్చిన మొదటి అవకాశం అది. కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయలేకపోయాను. శేష్ గారు ఈ వేడుకు రావడం చాలా ఆనందం. ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత అరుణ్ కి కృతజ్ఞతలు. సరిత గారితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను, సునీల్ గారు అద్భుతమైన వ్యక్తి. గొప్ప డెడికేషన్ వున్న నటుడు. ఆయన ఈ సినిమాలో వుండటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. శివకార్తికేయన్ గ్రేట్ పెర్ఫార్మర్. ఇందులో శివకార్తికేయన్ గారి అద్భుతమైన నటన, యాక్షన్ యాంగిల్ చూస్తారు. అదితి శంకర్ ఎనర్జిటిక్ గా చేసింది. సునీల్ గారి వలనే ఈ సినిమా ఇంత గ్రాండ్ గా విడుదలౌతుంది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. మండేలాకి పని చేసిన టీంతో కలసి ఈ సినిమాని తీర్చిదిద్దాం. ఖచ్చితంగా ‘మహావీరుడు’ మీ అందరినీ అలరిస్తుంది. మండేలా చిత్రానికి చాలా పాజిటివ్ రివ్యూస్ తెలుగు ఆడియన్స్ నుంచే వచ్చాయి. మహావీరుడు సినిమాని కూడా మీ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ’’ అన్నారు.  
 
సరిత మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి వేడుకకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. చాలా డిఫరెంట్ జోనర్  సినిమా ఇది. చాలా కష్టపడి చేశాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం దర్శకుడు చెప్పిన కథ. కథ విన్న తర్వాత నో చెప్పాలనిపించలేదు. బ్రిలియంట్ స్క్రిప్ట్ ఇది. దానికి తగ్గట్టు హీరో శివకార్తియేన్ గారు అద్భుతంగా చేశారు. ఆయన్ని చూస్తునపుడు చిన్న రజనీ గారిలా అనిపిస్తారు. అదితి చాలా ప్రతిభ వున్న నటి. దర్శకుడు చాలా నిజాయితీగా ఈ సినిమా తీశారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తీశారు.  టీం అందరికీ కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్ లో చూడండి. మంచి అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు.
 
అనుదీప్ మాట్లాడుతూ.. శివకార్తియేన్ గారు పెద్ద  స్టార్ హీరో అయ్యుండి కూడా ఇంత సింపుల్ గా ఉండటం నాకు ఆశ్చర్యమనిపించింది. ఆయనకి వున్న స్టామినాకి మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి. దర్శకుడు అశ్విన్ మండేలా సినిమా చూసినప్పటి నుంచి నా స్నేహితుడు. నిర్మాత అరుణ్ ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమా విజయం సాధించి వారిద్దరూ మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి. సరిత గారిని చాలా రోజుల తర్వాత చూడటం ఆనందంగా వుంది. జులై 14న ఈ సినిమా అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు.    
 
నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. ఈ సినిమాని తెలుగు  లో ప్రజంట్ చేస్తున్న సునీల్ గారికి కృతజ్ఞతలు. వారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ సినిమా చాలా స్పెషల్, ఎమోషనల్ మూమెంట్. మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టాను. నా తొలిసినిమా శివ కార్తికేయన్ లాంటి అద్భుతమైన హీరోతో పని చేయడం ఆనందంగా వుంది. అదితి చాలా చక్కగా నటించింది. దర్శకుడు అశ్విన్ ఈ సినిమాని అద్భుతంగా తీశారు, సరిత గారు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

HER డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు : రుహాణి శర్మ