'నాట్యం' చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న క్లాసికల్ డ్యాన్సర్ సంధ్య రాజు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (14:25 IST)
రామ్‌కో గ్రూప్ ఛైర్మెన్ పిఆర్ వెంకట్రామ రాజు కుమార్తెగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్‌గా కూడా అందరికీ సుపరిచితమైన సంధ్య రాజు, తెలుగు చలనచిత్ర రంగం ద్వారా సినీ రంగానికి పరిచయం కాబోతున్నారు. 
 
క్లాసికల్ డ్యాన్సర్‌ నుండి యాక్టర్‌గా మారుతున్న ఈమె, దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టిన రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ‘నాట్యం’ అనే డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌ ఫీచర్ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు.
ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు నిర్మాణ బాధ్యతలు వహించారు. రాబోయే కొన్ని వారాలలో థియేటర్‌లలో విడుదలకు సిద్ధం కానున్న, ఈ ‘నాట్యం’ చిత్రానికి ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించనున్నారు.
 
ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్, ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి సంబంధించిన యూట్యూబ్ టీజర్‌ని టాలీవుడ్ సూపర్‌స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే విడుదల చేయగా, అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ఉపాసన కామినేని కొణిదెల సినిమాకు సంబంధించిన ‘పోస్టర్‌’ని విడుదల చేసారు. అతి త్వరలో ఈ సినిమా తమిళంలో కూడా విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments