Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చేసింది..!

Webdunia
బుధవారం, 1 జులై 2020 (21:33 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ కి ట్రెమండ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తుంటే.. కరోనా కారణంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమా తర్వాత బాలయ్య సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరిగింది. తాజా వార్త ఏంటంటే... బాలయ్య, బి.గోపాల్‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. బోయపాటితో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత బి.గోపాల్‌తో సినిమా స్టార్ట్ చేస్తారట. ఈ చిత్రానికి స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు.
 
ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిసింది. బాలయ్య - బి.గోపాల్ కాంబినేషన్లో రూపొందిన రౌడీ ఇన్‌స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. 
 
దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందంటున్నారు. అయితే.. ఈ సినిమా నిర్మాత ఎవరో..? ఇందులో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరో..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments