Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గలగలగల గ్లాస్‌మేట్సు'.... "చిత్రలహరి" రెండో సాంగ్ రిలీజ్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:07 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం "చిత్రలహరి". 'నేను శైలజ' ఫేమ్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన 'పరుగు పరుగు' పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోనే రెండో పాట క్లాస్‌మేట్స్, సోల్‌మేట్స్, రూమ్‌మేట్స్ ఇలా అందరికి ఎక్కడో చోట ఫుల్‌స్టాప్ ఉంటుంది కాని.. ఏ ఎండు లేని వాడే మందు పంచుకునే గ్లాస్‌మేట్స్.. గలగలగల గలగలగల గ్లాస్‌మేట్సూ.. అంటూ సాగే ఈ పాట మందు బాబులను ఎంతో ఆకట్టుకునేలా ఉంది. 
 
ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, పెంచల్ దాస్, దేవీశ్రీ ప్రసాద్‌లు ఆలపించారు. యూత్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోయేలా ఉంది. అంతేకాదు ఈ పాటలో సునీల్‌తో కలిసి సాయి ధరమ్ తేజ్ చేసిన అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 
 
ఇకపోతే, ఈ చిత్రం పాటలోని ఆడియోలో ఎవరికీ తెలియని ఓ అమ్మాయి ఓ వాయిద్యాన్ని వాయిస్తూ కనిపిస్తుంది. ఆ వాయిద్యాన్ని సారంగి అంటారు. దాన్ని వాయిస్తున్న అమ్మాయి పేరు మనోన్మణి. దక్షిణాది భారతదేశం నుంచి ఈ వాయిద్యాన్ని వాయించిన తొలి మహిళ మనోన్మణి. ఈ చిత్ర నిర్మాతలు రంగస్థలం వంటి భారీ హిట్ చిత్రం తర్వాత నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments