Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రలహరితో సాయి ధరమ్ తేజ్ అరుదైన రికార్డ్.. ఏంటది?

Webdunia
బుధవారం, 12 మే 2021 (22:40 IST)
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'చిత్రలహరి' మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 100 మిలియన్ వ్యూస్ కే రికార్డా అనుకోకండి... ఎందుకంటే హిందీలో డబ్ అయిన సాయి ధరమ్ తేజ్ చిత్రాల్లో ఏకంగా 3 సినిమాలు 100 మిలియన్ వ్యూస్ దాటేశాయి. అదీ విశేషం. 
 
ఇక సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన 'చిత్రలహరి' హిందీలో 'ప్రేమమ్' పేరుతో డబ్ అయ్యి యూట్యూబ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ్ వరసగా ప్లాప్ లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ చిత్రం హిట్ ఆయనకు మంచి జోష్‌ను ఇచ్చింది. 
 
ఇక గతంలో సాయి ధరమ్ తేజ్ నటించిన 'తేజ్ ఐ లవ్ యూ' మూవీ హిందీలో 'సుప్రీమ్ ఖిలాడీ-2'గా డబ్ అయ్యి... 218 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన మరో చిత్రం 'ఇంటెలిజెంట్' 107 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ హిందీ ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments