Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సందీప్ కిషన్ పుట్టినరోజు.. సూపర్ స్టోరీతో వచ్చేస్తున్నాడు..

Advertiesment
సందీప్ కిషన్ పుట్టినరోజు.. సూపర్ స్టోరీతో వచ్చేస్తున్నాడు..
, శుక్రవారం, 7 మే 2021 (12:27 IST)
సందీప్ కిషన్ తెలుగు సినీ నటుడు. 1987 మే 7న చెన్నైలో జన్మించాడు. చొటా కె. నాయుడు, స్యామ్ కె. నాయుడు బంధువు. మనసు మాటవినదు అనే సినిమాతో తెలుగులొ పరిచయమయ్యాడు. రాశిఖన్నా సరసన  వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
గుండెల్లొ గోదావరి, స్నేహ గీతం, శమంతకమణి వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. సినీ రంగంలో ఆశించినంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సినీ రంగంలో ఆశించినంత విజయాలు లేకున్నప్పటికి అందిన ప్రతి చిత్రాల్లోను తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. 
 
అంతేగాకుండా తాజాగా ఏ1 ఎక్స్‌ప్రెస్‌‌ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఇంకా నరకాసురుడు, వివాహ భోజనంబు, గల్లీ రౌడీ, సినిమాల్లో సందీప్ కిషన్ నటించాడు. ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
 
ఇక చిత్రాల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు సందీప్‌ కిషన్‌. సందీప్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలో సంతకం చేశాడు. సందీప్‌ కిషన్ కెరీర్‌లో ఇది 28వ చిత్రం. ఈ సినిమాకు గతంలో సందీప్‌తో ‘టైగర్‌’ వంటి వెరైటీ సినిమా తీసిన వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్నారు. 
 
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. పుట్టినరోజు సినిమా ప్రకటనతో పాటు పోస్టర్ కూడా విడుదల చేశారు. సూపర్ నేచురల్ ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కరోనా తగ్గగానే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా నాన్నకు ఆ పిచ్చి వుండేది.. అనసూయ భరద్వాజ్