ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రేమికుడైన వివేక్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు వివేక్ సొంత గ్రామం పెరుంగటూర్‌కు తీసుకెళ్లారు. వివేక్‌కు నివాళిగా ఆ గ్రామ శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా ఆయన అస్థికలను చల్లారు.
మొక్కలను ఎంతగానో ప్రేమించే వివేక్ చనిపోయిన తర్వాత వాటికి ఎరువులా మారడం పలువురిని కంటతటి పెట్టిస్తోంది. అబ్దుల్ కలామ్‌ను ఆదర్శంగా తీసుకొని గ్లోబల్ వార్మింగ్ నివారణలో భాగంగా చెట్ల పెంపకాన్నే తన జీవిత మిషన్‌గా తీసుకున్నాడు వివేక్.
తన జీవిత కాలంలో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి వరకు 33 లక్షల మొక్కలు నాటారు. ఆయన లక్ష్యాన్ని తాము పూర్తిచేస్తామంటూ అభిమానులు ముందుకు వస్తున్నారు.