Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ : కత్తిలాంటోడు... గౌతమీపుత్ర శాతకర్ణి పోటీ!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (14:50 IST)
టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ 150వ చిత్రం, బాలయ్య 100వ చిత్రంపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి హీరోలతో పోలిస్తే బాలయ్య 100 సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'కే హైప్ ఎక్కువ అంటున్నారు సినీ పండితులు. ఎందుకంటే చిరంజీవి 150 వ సినిమా ఎపుడెపుడు వస్తుందాని ఎదురుచూసిన తరుణంలో ఎట్టకేలకు సినిమా ఫైనల్ అయ్యింది. తమిళంలో ఘనవిజయం సాధించిన బ్లాక్ బస్టర్ ''కత్తి'' రీమేక్‌గా తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో తెరకెక్కుతున్న విషయం దాదాపు 6 నెలల క్రితమే అందరికీ తెలుసు. కథ మొత్తం దాదాపుగా అందరికి తెలిసిందే. 
 
వి.వి వినాయక్ ఈ కథలో మెగాస్టార్‌ని దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఇది ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. ఇక బాలయ్య 100వ సినిమాని తీసుకుంటే చారిత్రాత్మక చిత్రాన్నిఎంచుకున్నాడు. దీనికి తోడు క్రిష్ ఇప్పటివరకు దర్శకుడిగా పరాజయం పొందిన సినిమాలు లేవు కాబట్టి శాతకర్ణిపైనే అందరి దృష్టి నెలకొంది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో హాటెస్ట్ మూవీ మాత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే బాలయ్య శాతకర్ణితో ఇంకో స్క్రిప్ట్‌ని రెడీ చేసుకున్నారు. రెండు సబ్జెక్టులో ఓ సినిమా ఫైనల్ చేసుకుని, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. కాబట్టి ఆ విధంగా చూస్తే బాలయ్య బెటర్ అనిపించేసుకున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త అల్లుడికి 465 వంటకాలతో సంక్రాంతి విందు.. (Video)

సింగర్‌తో కలిసి యువతిపై హర్యానా బీజేపీ చీఫ్ అత్యాచారం!!

టూరిస్ట్ బస్సులో మంటలు - నిజామాబాద్ వాసి సజీవదహనం

దక్షిణాఫ్రికాలో ఘోరం... బంగారు గనిలో చిక్కున్న కార్మికులు.. 100 మంది మృతి

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడిన తండ్రి...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments