చిరంజీవి-సుక్కు యాడ్ అదిరిందిగా.. (video)

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (16:10 IST)
ప్రముఖ దర్శకుడు సుకుమార్ "పుష్ప-2" పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి "ఆచార్య" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, రామ్ చరణ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. 
 
ఈ సినిమా మాత్రమే కాకుండా మెగాస్టార్ ఖాతాలో భోళా శంకర్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. వరుసగా సినిమా షూటింగులతో బిజీగా ఉన్న చిరు త్వరలోనే "ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేయనున్నారు.
 
ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెగాస్టార్‌ చిరంజీవి ఈ యాడ్ చేస్తున్నట్టు వారే స్వయంగా వెల్లడించారు కూడా. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం కానుంది. 
 
తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యాడ్‌లో మెగాస్టార్‌తో పారు ఖుష్బూ, అనసూయ భరద్వాజ్ కన్పించగా, ఒక మంచి ట్విస్ట్‌తో హ్యాపీ న్యూస్‌ను రెవీల్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments