Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "సైరా"కు తాత్కాలిక బ్రేక్... మెగా బర్త్‌డే రోజున ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. అయితే, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (12:16 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. అయితే, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల‌న మూవీ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు.
 
స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం కోకాపేట‌లో ప్ర‌త్యేకంగా వేసిన‌ సెట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జరుపుకుంది. నిజానికి ఇక్కడే 40 రోజుల పాటు మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశారు. కానీ అయితే అర్థాంత‌రంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. 
 
ప్ర‌స్తుత షెడ్యూల్‌లో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి.. బ్రిటీష్ చ‌క్ర‌వ‌ర్తితో పోరాడే యుద్ధ స‌న్నివేశాల‌ని తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో న‌య‌న‌తార‌, చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్ర ఫ‌స్ట్ లుక్ చిరు పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారని స‌మాచారం. 
 
కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై హీరో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది సంగీతం సమకూర్చుతున్నారు. యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments