Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు : ఒకే వేదికపై ఇద్దరు అగ్ర హీరోలు!

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (08:36 IST)
నందమూరి బాలకృష్ణ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుని తెలుగు చిత్రపరిశ్రమ ఆయనకు స్వర్ణోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. దీంతో ఇద్దరు అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవిలు ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ ఇద్దరు హీరోలను వారి అభిమానులే‌ కాదు.. చిత్రపరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది. వచ్చే నెల ఒకటో తేదీ హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్ ఇందుకు వేదికగానుంది. 
 
అదేసమయంలో బాలయ్య స్వర్ణోత్సవ వేడులకు మెగాస్టార్ ఇప్పటికే ఆహ్వానం అందుకున్నారు‌. ఏపీ చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు. తెలంగాణ సిఎం రేవంత్ రాకపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. చాలా రోజుల అనంతరం అటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు. చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ వేడుక జరగనుంది.
 
మరోపక్క బాలయ్య అభిమానులు ఏపీలో అమరావతి ప్రాంతంలో మరో భారీ వేడుకను నిర్వహించనున్నారు. సెప్టెంబరు రెండో వారంలో ఈ వేడుక జరగనుంది. చిత్ర పరిశ్రమలో ఏ హీరోకులేని విధంగా, బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఇటు చిత్ర పరిశ్రమ ఇటు అభిమానులు పదిరోజుల వ్యవధిలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30 న అభిమానుల ఆధ్వర్యంలో జరగబోయే ఎన్బీకే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ప్రకటించనున్నారు. మరోవైపు, ఈ వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం. దీంతో ఒకే వేదికపై ముగ్గురు అగ్ర హీరోలు కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments