Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక వేదికపైకి బాలకృష్ణ - చిరంజీవి!?

Advertiesment
balaiah - chiru

ఠాగూర్

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (18:05 IST)
టాలీవుడ్ అగ్ర నటులు బాలయ్య, చిరంజీవిలను ఒకే వేదికపై చూడాలని వారి అభిమానులే‌ కాదు. మొత్తం చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది. సెప్టెంబరు ఒకటో తేదీన నోవాటెల్ ఇందుకు వేదిక కానుంది. బాలయ్య స్వర్ణోత్సవ వేడులకు మెగాస్టార్ ఇప్పటికే ఆహ్వానం అందుకున్నారు‌. 
 
ఏసీ సీఎం చంద్రబాబు నాయడు కూడా వస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రాకపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. చాలా రోజుల అనంతరం అటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగనుంది. 
 
మరోపక్క బాలయ్య అభిమానులు ఎపి లో అమరావతి ప్రాంతంలో మరో  భారీ వేడుకను నిర్వహించనున్నారు. చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేని విధంగా, బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఇటు చిత్ర పరిశ్రమ ఇటు అభిమానులు  పదిరోజుల వ్యవధిలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30న అభిమానుల ఆధ్వర్యంలో జరగబోయే ఎన్‌బీకే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ప్రకటించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను దాన్ని ఆయనకు గురుదక్షిణగా భావించా : మోహన్ లాల్