Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవిత రాజశేఖర్ 'ప్రైవేట్' పార్టీలో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి, జీవితా రాజశేఖర్ దంపతులకు మధ్య వైరం ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, అదంతా కేవలం మీడియా ప్రచారం మాత్రమేనని, తమమధ్య ఎలాంటి విభేదాలు లేవనీ వారు మరోమారు నిరూపించారు.

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (14:49 IST)
మెగాస్టార్ చిరంజీవికి, జీవితా రాజశేఖర్ దంపతులకు మధ్య వైరం ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, అదంతా కేవలం మీడియా ప్రచారం మాత్రమేనని, తమమధ్య ఎలాంటి విభేదాలు లేవనీ వారు మరోమారు నిరూపించారు. తాజాగా జీవితా రాజశేఖర్ ఇచ్చిన ఓ ప్రైవేట్ పార్టీకి చిరంజీవితో పాటు ఆయన సోదరుడు నాగబాబు, హీరో మోహన్ బాబు, నిర్మాతలు టి.సుబ్బిరామిరెడ్డి, సి.అశ్వినీదత్‌ తదితరులు హాజరయ్యారు. 
 
నిజానికి మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. రెండో షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. దీంతో మొన్న‌టివ‌ర‌కు పొడుగు మీసం, భారీ గ‌డ్డంతో కనిపించిన చిరు ఇప్పుడు నార్మ‌ల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.
 
అదేసమయంలో రెండో షెడ్యూల్‌కి కాస్త టైం దొర‌క‌డంతో దాదాపు అన్నీ ఈవెంట్స్, పార్టీస్ క‌వర్ చేస్తున్నాడు. ఇందులోభాగంగానే జీవితా రాజశేఖర్ ఇచ్చిన ప్రైవేట్ పార్టీకి చిరంజీవి హాజరైనట్టు తెలుస్తోంది. 
 
కాగా, రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం "పీఎస్‌వి గరుడవేగ" చిత్రం మంచి విజ‌యం సాధించిన విషయం తెల్సిందే. ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ ఇలా కొంద‌రితో క‌లిసి స‌ర‌దా పార్టీ సెల‌బ్రేట్ చేసుకుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. ఏదిఏమైనా చిరంజీవి, రాజశేఖర్‌లు ఇలా అన్యోన్య‌యంగా క‌నిపించ‌డం ఇద్దరి హీరోల అభిమానులకు శుభవార్తేనని చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments