Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైరా సెట్స్‌కి నయనతార- మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ''సైరా'' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి త

Advertiesment
సైరా సెట్స్‌కి నయనతార- మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
, ఆదివారం, 31 డిశెంబరు 2017 (13:01 IST)
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ''సైరా'' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార సైరా షూటింగ్‌‌లో పాల్గొననుంది. ఫిబ్రవరి నుంచి నయనతార సైరా షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. 
 
ఈ సినిమా నుంచి నయనతార తప్పకుంటున్నట్లు వార్తలొచ్చినా అవి నిజం కాదని సమాచారం. నయనతార ముందుగా ఇచ్చిన డేట్స్ ప్రకారమే ఆమె ఫిబ్రవరి నుంచి సైరా సెట్స్‌కి వస్తారని సినీ యూనిట్ వర్గాల సమాచారం. చిరంజీవి, నయనతార కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు నటిస్తున్నారు. 
 
ఇకపోతే సైరా సినిమా రూ.200 కోట్ల బ‌డ్జెట్‌‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇందులో ఒక హీరోయిన్ ఖరారు కాగా మిగిలిన ఇద్దరిని సినీ యూనిట్ వేట కొనసాగిస్తోంది. ఇక ఈ క్రేజీ సినిమాకి ఏ.ఆర్‌.రెహ‌మాన్‌ని ఎంపిక చేసినా, అనివార్య కార‌ణాల‌తో ఆయ‌న వైదొల‌గారు. సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రనేది ఇంకా ఖరారు కాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ 'spiritual politics' ప్రకటన.. ధ్యానముద్రలో కాసేపు.. కమల్ ట్వీట్